yourcartoon.in ప్రతి నెలా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కార్టూన్ పోటీకి వచ్చిన అనూహ్య స్పందనకు సంతోషిస్తూ , ఈ కార్టూన్ పోటీలో పాల్గొన్న కార్టూనిస్టులందరికి yourcartoon.in మనస్పూర్తి గా కృతజ్ఞతలు తెలియజేస్తుంది . కార్టూనిస్టులు అప్లోడ్ చేసిన కార్టూనులు ఏ కార్టూన్ కు ఎక్కువ వ్యూవ్స్ వస్తే వారిని విజేతలుగా పరిగణలోకి తీసుకుని ప్రైజ్ మనీ ని అందజేయడం జరుగుతుంది అని ప్రకటించిన విషయం తెలిసిందే . అంటే వ్యూవర్స్ మాత్రమే న్యాయనిర్ణేతలు , తప్పితే ఈ విజేతల ప్రకటనలో యాజమాన్యం పాత్ర లేదని తెలియజేస్తూ, ఈ ఆగస్టు నెల విజేతల పేర్లు ప్రకటిస్తున్నందుకు yourcartoon.in సంతోషం వ్యక్తం చేస్తోంది .
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే గతం లో ప్రకటించిన మాదిరిగా వెయ్యి నూట పదహారు కాకుండా , ఈ ప్రైజ్ మనీ మొత్తాన్ని పదిహేను వందల రూపాయలకు పెంచుతూ , ప్రతి నెల మూడు కార్టూన్ లకు సమానంగా, అంటే ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించాం . కాబట్టి ఈ సారి విజేతలుగా మొదటి స్థానం లో వెయ్యికి పై చిలుకు వ్యూవ్స్ తో కార్టూనిస్ట్ నాగరాజు ఉన్నారు .
ఎంత సంపాదించినా , పొదుపు నేర్పు లేకపోతే జీవితం లో ఎంత నష్టం జరుగుతుందో తెలిసిన తండ్రి తన కొడుకుకు పొదుపు ప్రాధాన్యతను నేర్పే విధానం తన కార్టూన్ లో తెలియజేశారు కార్టూనిస్ట్ నాగరాజు . అలాగే అయిదు వందల పై చిలుకు వ్యూవ్ స్ తో కార్టూనిస్ట్ రామ్ శేషు రెండో స్థానం లో నిలిచారు . వృద్దాప్యం లో ప్రతి మనిషి తాము కనిపెంచిన పిల్లల నుంచి ఎదుర్కొంటున్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించారు తన కార్టూన్ లో .
ఆధునికతను చుట్టేసుకుంటున్న సమాజం లో కన్న కొడుకులు కూడా వృద్దాప్యం లో తల్లి దండ్రులను ఎలా వదిలించుకుంటున్నారో చూపించిన రామ్ శేషు కార్టూన్ ను వ్యూవర్స్ ఆదరించారు . అలాగే మూడో స్థానం లో శర్మ అనే కార్టూనిస్టు నిలిచారు . సాంకేతికత పేరుతో నిత్యం మనం అనేక రకాలైన గాడ్జెట్స్ తో జీవితాన్ని కొనసాగించక తప్పని పరిస్థితి . కానీ ఆ సాంకేతికత వ్యసనం లా మారితే ఎంతటి దుష్పరిణామాలు తలెత్తుతాయి అనేది కార్టూనిస్ట్ శర్మ తన కార్టూన్ లో వివరించారు .

పేషెంట్ కోమా లో ఉన్నాడు. అయితే వాట్సాప్, ఫేస్ బుక్ లకి మాత్రం స్పందిస్తున్నాడు. మేరు వాటిద్వారా అతన్ని పలకరించవచ్చు.
సామాజిక సమస్యల పై వేసిన ఈ మూడు కార్టూన్ లను ఆదరించిన వ్యూవర్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ , ఈ ముగ్గురిని సమానంగా గౌరవించాలనే ఉద్దేశ్యం తో yourcartoon.in ఇవ్వతలపెట్టిన 1500 రూపాయలను సమానంగా అంటే ఒక్కొక్కరికి 500 చొప్పున ఇవ్వదలిచాము . కాబట్టి విజేతలు తమ బ్యాంకు అకౌంట్ వివరాలు , పేరు, బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు , ఐ ఎఫ్ ఎస్ ఐ కోడ్ freeticket.in@gmail అనే మెయిల్ కు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం . ఈ పోటీ కొనసాగుతుంది , అంటే సెప్టెంబర్ నెల పోటీ కి కార్టూనిస్టులు తమ కార్టూన్ లు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం .